ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్న బాబు

హైదరాబాద్) ప్రజాస్వామ్యాన్ని
చంద్రబాబు ప్రభుత్వం అవహేళన చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రలోభాలు పెట్టి లాక్కొన్న ఎమ్మెల్యేల అనర్హత
ను తేల్చేందుకు అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు.
శాసనసభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ సందర్బంగా వైఎస్ జగన్  గణాంకాలతోసహా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టారు.
వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

      పార్టీ మారిన
ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలి లేదంటే ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి. మేం
అనర్హులను చేస్తామని అంచనా వేసి ఓటింగ్ నుంచి తప్పించుకొనేందుకు ఎత్తుగడ వేశారు.
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రలోభాలు పెట్టుకొని
కొనుగోలు చేశారో అందరం చూశాం. ఇప్పుడు చూస్తే ఆ ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించటం
లేదు. ఇప్పటికే విప్ జారీ చేశాం. దీని ఆధారంగా వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి
వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంది. అయినప్పటికీ ఓటు వేయకపోతే మాత్రం అనర్హులు
అవుతారు.

ఈ విషయంలో
మంత్రులు మా మాటల్ని వక్రీకరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ
ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ప్రజల గొంతు వినిపించాల్సిన ప్రతిపక్ష
ఎమ్మెల్యేలు లేకుండా చేసేందుకు , కుట్రలు చేసేందుకు అధికారం ద్వారా వచ్చిన
సొమ్ములను ప్రలోభాలకు వాడుకొంటున్నారు. 

Back to Top