ప్రజలే నా ఆస్తి, బలం

  • బాబులా మోసం చేయడం వైయస్‌ జగన్‌కు రాదు
  • మహానేత వైయస్‌ఆర్‌ ప్రతి గుండెల్లో బతికే ఉన్నారు
  • దెయ్యాలకు గట్టిగా బుద్ధి చెబుదాం
  • దీబగుంట్లలో వైయస్‌ జగన్‌ ప్రసంగం
నంద్యాల: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణిస్తూ ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అన్నారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా దీబగుంట్ల గ్రామంలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా న్యాయంవైపు నిలబడాలని ప్రజలకు విన్నవించారు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చూపించే టీవీ ఛానళ్లు, పత్రికలు నా దగ్గర లేవని వైయస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబులా అధికారం కోసం దిగజారిపోయి మోసం చేసే అలవాటు లేదన్నారు. మహానేత చనిపోయి 8 ఏళ్లు గడిచినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి గుండెల్లో బతికే ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు అవినీతి సొమ్ముతో సంపాదించిన మూటలతో మీ దగ్గరకు వస్తారన్నారు. ఓటర్లతో బేరాలు చేసి జేబులో నుంచి దేవుడి పటం తీసి రూ. 5 వేలు చేతిలో పెట్టి ఆ పటంపై ప్రమాణం చేయించుకుంటాడన్నారు. మీ దగ్గరకు వచ్చే దెయ్యాలతో గొడవ పెట్టుకోకుండా లౌక్యంగా సమాధానం చెప్పిన్యాయంవైపు నిలబడాలన్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న సమరంలో నంద్యాల ప్రజలంతా ధర్మానికి ఓటు వేసి వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. 
Back to Top