ప్రజల గుండెల్లో గునపం గుచ్చారు.

ప్రజల ప్రేమ ఆప్యాయతలే నడిపిస్తున్నాయి

అక్రమాలకు పాల్పడే చింతమనేనికి 3 వ ర్యాంకిచ్చిన
బాబును ఏమనాలి

బాబు పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?

రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోంది.

ప్రజలు నిలదీస్తారనే ఎన్నికల మానిఫెస్టోను మాయం
చేశారు

బాబు 4 లక్షల దోపిడీ చేస్తే ప.గో. జిల్లా
ప్రతినిధులు తామేమీ తక్కువ తినేది లేదంటున్నారు.

తహశీల్దార్ 
దాడిచేసిన ఎమ్మెల్యేను శిక్షించకుండా రక్షించడంతోనే

బాబు దుర్మార్గపు పాలనకు తొలి అడుగులు ఇక్కడి
నుంచే పడ్డాయి

ఏలూరు బహిరంగ సభలో జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 

 

 ఏలూరు :

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏక మొత్తంగా టిడిపి
వారినే ప్రజలు గెలిపించినా, చంద్రబాబు నాయుడు మాత్రం జిల్లా ప్రజల గుండెల్లో
గునపాలను గుచ్చారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పైన చంద్రబాబు కూర్చుని
4 లక్షల కోట్ల మేర అక్రమాలకు పాల్పడితే ఇక్కడి ప్రజాప్రతినిధులు తామేమీ తక్కువ
తినలేదంటూ విచ్చలవిడిగా ఇసుక, మట్టిని భోంచేస్తున్నారని మండిపడ్డారు.
బజ్జీల మాదిరిగా భూములను తినేస్తున్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గపు, దుష్టపాలనకు
ఈ జిల్లాలోని అక్రమాలతోనే తొలి అడుగులు పడ్డాయన్నారు.  ప్రజా సంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లమైలురాయిని
దాటిన సందర్భంగా ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్ జగన్
మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనను తూర్పారబట్టారు.

నలుదిక్కులా కిక్కిరిన జనసమూహాన్ని ఉద్దేశించి
ప్రసంగించిన వైయస్ జగన్  ప్రజల ప్రేమ,
ఆప్యాయత, అభిమానమే తనను నడిపిస్తోందని స్పష్టం చేశారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...

ఎండలు తీక్షణంగా ఉన్నా ఎవరూ ఖాతరు చేయకుండా
ఒకవైపున సమస్యలుచెపుతూ, మరో వైపున ఆర్జీలు ఇస్తూ, ఇంకో వైపు
ఆప్యాయతలు,ప్రేమానురాగాలు,ఆత్మీయతలతో  తన భుజాన్ని
తడుతూ  తోడున్నామంటూ అడుగులో అడుగేస్తున్న
అందరికీ ధన్యవాదాలు.

 రెండువేల
కిలోమీటర్లు దాటుకుని ఏలూరులో అడుగుపెట్టడం జరిగింది. 6 నెలలకు పైగా పాదయాత్ర
జరుగుతున్నప్పుడు చాలా మంది ఎలా నడవగలుగుతున్నారంటూ అడుగుతున్నారు. వారందరికీ తాను
చెప్పే మాట సమాధానం మాత్రం వారి ప్రేమ ఆప్యాయతలే నడిపించాయి.

నాన్నగారి వెళ్లిపోయినప్పుడు  కొడుకుగా చాలా చాలా బాధపడ్డా... నాన్నగారు ఎక్కడికీ పోలేదన్న ధీమా....ప్రతి గుండెలోనూ బతికే
ఉన్నాడన్న ధీమా... ఆయన వెళుతూ తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారన్న భరోసా తోనే ఆ
బాధ నుంచి బయటకు వచ్చాను.

  గోదావరి
జిల్లాలో అడుగుపెట్టినప్పుడు నా దగ్గరకు వచ్చిన రైతన్నలు, ప్రజలు చెప్పిన
మాటలేమిటంటే, అన్నా మా జిల్లా నుంచి  చంద్రబాబు
నాయుడు మాటలను విశ్వసించి, కలలో కూడా ఊహించని రీతిలో  మా జిల్లా నుంచి ఆయనకు 15 కు 15 స్థానాలు కట్టబెట్టినా,
ఆయన మాత్రం జిల్లా ప్రజల గుండెల్లో గునపం గుచ్చారు.

 యథా చంద్రబాబు తథా ఎమ్మెల్యుగా ఉన్నారు. పైన చంద్రబాబు
4 లక్షల కోట్లు తింటే, తామేమీ తక్కువ కామంటూ ఎమ్మెల్యేలు ఇసుక నుంచి మట్టి దాగా
దేనిని వదిలి పెట్టలేదంటూ వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధేసింది.

బాబు దుర్మార్గపు పాలనకు ఈ జిల్లా నుంచే తొలి
అడుగులు
 

ఇసుక మాఫియకు అడ్డుపడిన తహశీల్దార్ వనజాక్షి జుట్టుపట్టుకుని
ఈడ్చుకుని వెళ్లిన ఇక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అండగా నిలబడటమే బాబు
దుర్మార్గపు పాలనకు తొలి అడుగులు అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారి
జుట్టుపట్టుకున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేయించాల్సిన సిఎం , తన స్థాయి మరచి
పంచాయతీ చేసి ఎమ్మెల్యేను రక్షించారు. కేసులులేకుండా చేశారు. ఇదీ రాష్ట్రంలోని
పరిస్థితి. ఇలా పశ్చిమ గోదావరి ప్రజల రుణం తీర్చుకున్నారు చంద్రబాబు అంటూ చురకలు
వేశారు.

ఇవే కాకుండా 
ఫారెస్టు అధికారులు, పోలీసులు, అంగన్ వాడీ అక్కచెల్లెమ్మలను వదిలి పెట్టకుండా
తిట్టడం  కొట్టడం వంటివి ఈజిల్లాలోనే జురుగుతున్నాయని
వైయస్ జగన్ అన్నారు.  అడిషన్ జిల్లా
జడ్జిపై  దౌర్జన్యం చేసిన ఘనత టిడిపి
ఎమ్మెల్యేలదే అని పేర్కొన్నారు.

తమ్మిలేరు రిజర్వాయర్ నుంచి చింతమనేని ఇసుకను
దోచుకుని తింటున్నారు, మరో ఎమ్మెల్యేశేషారావు గోదావరి తల్లిని ఎక్కడా
వదిలిపెట్టలేదు. ఈ ఒక్క జిల్లా నుంచే దాదాపుగా 400 కోట్ల అక్రమ తవ్వకాలు
జరిగాయంటే, సాక్షాత్తూ సిఎం కళ్ల ముందే, వేల లారీలులు, లక్షల టన్నుల ఇసుక పోతున్నా
నోరు మెదపటం లేదంటే ఈ ప్రభుత్వంలో ఉన్న లంచాలు, అవినీతి కళ్లకు కట్టినట్లు
కనిపిస్తోందన్నారు.

సిఎం పైన ప్రోత్సహిస్తుంటే, ఇక్కడ ఎమ్మెల్యేలు
పేట్రేగి పోతున్నారనీ,  ఇక్కడి ఎమ్మెల్యే
బుజ్జి,  గుడి భూములు, స్కూలు భూములు,
చివరకు దాతలు ఇచ్చిన బూములకు పత్రాలను సృష్టించి మరీ బజ్జీల మాదిరిగా భూములును
తింటున్నారని ధ్వజమెత్తారు.

వైయస్ హాయంలోనే అభివృద్ధి

ఏలూరు పరిసరాల్లో దివంగత మహానేత వైయస్
ఆర్ హయాంలో వేలాది మందికి ఇళ్లు కట్టిస్తే, 4 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క
సెంటుభూమిని కూడా ఇవ్వలేదన్నారు. అప్పట్లో వేసవి కాలం వస్తే గడగడలాడిపోయే ఏలూరు
వాసుల దాహార్తిని తీర్చడానికి వైయస్ ఆర్ హయాంలో 
వందల ఎకరాల్లో చెరువులను తవ్వించడమే కాకుండా, 8 ట్యాంకులను నిర్మించారని
వివరించారు. అలాగే తమ్మిలేరుకు వరద వస్తే మునిగి పోయే పరిస్థితి నుంచి
గట్టెక్కించిన సువర్ణయుగం వైయస్ ఆర్ పాలన అయితే, చంద్రబాబు హయాంలో ఇక్కడి ప్రజలను
ఏమి ఉద్దరించారో ఒక సారిబేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు.

వైయస్ ఆర్ మరణంతో పశ్చిమ గోదావరి ప్రజలు
తాము అనాథలమయ్యామని ఆవేదన చెందుతున్నారని జగన్ పేర్కొన్నారు. శాంతిభద్రతలకు నెలవైన
ఏలూరులో పట్టపగలే 7 మంది చనిపోయారనీ, ఇక్కడ రౌడీయిజంగా రాజ్యమేలుతోందని
దుయ్యబట్టారు. ఇలాచంద్రబాబు ఈజిల్లా రుణాన్ని తీర్చుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు
సంధించారు.

రాష్ట్రమంతటా స్మార్ట్ సిటీలంటూ
ఊదరగొట్టుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వంలో, ఇక్కడి కార్పొరేషన్ ఉద్యోగులు తమకు 5
నెలల నుంచి జీతాలు రావడం లేదంటూ తన వద్ద వాపోయారని, ఇదీ చంద్రబాబు స్మార్టీ సిటీ
పాలన అని అన్నారు.

రోడ్ల విస్తరణ సమయంలో ఉపాథి, గూడు
కోల్పోతున్న పేదల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం దారణమన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని అవినీతి,
అక్రమాలు జరుగుతుంటే ఇక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , మంచిగా
పనిచేస్తున్నారంటూ మూడు ర్యాంకును చంద్రబాబు ప్రకటించారంటే ఆయన పాలన తీరు అర్ధం
అవుతోందన్నారు

ఇలాంటిపాలనను ఒక్కసారి బేరీజు వేసుకుని
అబద్దాలు, మోసాలు చేసేవారు మనకు ముఖ్యమంత్రిగా కావాలా అన్నదానిపై ఒక్కసారి
ఆలోచించాలని వైయస్ జగన్ ప్రజలను కోరారు.

ఎన్నికలకంటే ముందు రైతు రుణమాఫీ అంటూ విస్తృతంగా
ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చాక రైతులను ఏవిధంగా వంచించిదీ, డ్వాక్రా సంఘాల రుణాలమాఫీ
అంటూ మహిళలను మోసం చేసిన తీరును, నిరుద్యోగులకు ఉపాథి, ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ
భృతిఇస్తానంటూ  మోసం చేసిన చంద్రబాబు
వైఖరిని తూర్పారపడుతూ ప్రజలంతూ ఈ మోసాన్ని వంచనను గమనించాలని సూచించారు. ఫోన్
కొడితే చాలు ఇంటికే మందు సరఫరా అయ్యే స్థాయికి చంద్రబాబు హైటెక్ పాలన
చేరిందన్నారు. పెట్రోలు , డీజిలు ధరలతో చేస్తున్న దోపిడీని కూడా వివరించారు.

 చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రతి
కులానికి,ప్రతి వర్గానికి ఒక్కో పేజీని కేటాయిస్తూ తయారు చేసిన మేనిఫెస్టోకు
విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చుకుని, ఎన్నికలయ్యాక వాటిని అమలు చేయకుండా మోసం చేసి, ఆ మేనిఫెస్టో
కనిపిస్తే ప్రజలు ఎక్కడ కొడతారో అన్న భయంతోనే దానిని మాయంచేశారని  మండిపడ్డారు.

ప్రత్యేక హోదా పై నయవంచన

అవినీతి, దుర్మార్గపు పాలనతో రాజ్యాంగానికి
పట్టపగలేతూట్లు  పొడుస్తున్న చంద్రబాబు,
ప్రత్యేక హోదా విషయంలో నయవంచనకు పాల్పడ్డారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
నాలుగేళ్లపాటు బిజెపితో కలిసి కాపురం చేసి హోదాను నీరుగార్చి, ఊసరవెళ్లిగా రంగులు
మార్చి రోజుకో డ్రామా ఆడుతున్నారంటూ విమర్శించారు. ఈసందర్భంగా , చంద్రబాబును
ఉద్దేశించి సైనికుడు...పేలని తూటా అంటూ ఒకపిట్ట కథను వినిపించారు.

ఇటువంటి పాలన సాగిస్తున్న పాలకులను
బంగాళాఖాతంలో కలపాలంటూ పిలుపునిచ్చి, నవరత్నాల్లో భాగంగా పిల్లల చదువుల కోసం ఉద్దేశించిన
కార్యక్రమాలను వివరించారు. 

ఈ సందర్భంగా  అధికారంలోకి వస్తే సొంత ఆటోను నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లకు ఏటా పదివేల రూపాయలు సహాయంగా అందిస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 

Back to Top