మహానేత విగ్రహ తొలగింపును నిరసిస్తూ ఆందోళన

విజయవాడ : విజయవాడలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ భవకుమార్ ఆధ్వర్యంలో  ఆందోళనకు దిగారు.  భవకుమార్తోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పడమట పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా వారిని పరామర్శించారు. టీడీపీ అరాచకాలపై వైయస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top