పెంచిన చార్జీలను ప్రభుత్వమే భరించాలి: బాజిరెడ్డి

నిజమాబాద్‌, 03 మార్చి 2013:

విద్యుత్తు ఛార్జీల పేరుతో కిరణ్ ప్రభుత్వం దోపిడిదారునిలా దోచుకుంటోందని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్థన్ మండిపడ్డారు. పెంచిన విద్యుత్తు ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజమాబాద్‌లో నిర్వహించిన విద్యుత్తు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. సువర్ణ పాలన అందించారు కాబట్టే ప్రజలు రెండో సారి దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌కు పట్టంగట్టారని గుర్తు చేశారు. మహానేత ఆశయాలను కిరణ్ సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. అవిశ్వాస తీర్మాన సమయంలో  చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేశారు. విద్యుత్తు ఛార్జీల పెంపులో చంద్రబాబుకు కూడా పాత్ర ఉందని బాజిరెడ్డి ఆరోపించారు.

Back to Top