రాష్ట్ర విభజనకు కాంగ్రెస్సే కారణం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోవడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని, అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తుకు సిద్ధం కావడం దారుణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్‌టీ రామారావు తెలుగు దేశం పార్టీని పెట్టారని, చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీపై ఎన్నో మాటలు మాట్లాడిన చంద్రబాబు పొత్తుకు సి ద్ధం కావడం ఆయన నీచమైన మనస్తత్వం ఏంటో అర్థమవుతుందన్నారు. నీరు చెట్టు పథకం కింద కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. 
 
Back to Top