రేపటి నుంచి చిత్తూరు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర



చిత్తూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 28వ తేదీ నుంచి చిత్తూరు జిల్లాలో ప్రారంభమవుతుందని పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తుందన్నారు. వైయస్‌ జగన్‌కు వస్తున్న  ప్రజా దరణ చూసి టీడీపీలో వణుకు మొదలైందని తెలిపారు.  ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జననేత పాదయాత్రను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలను కోరారు. కాగా, నవంబర్‌ 6వ తేదీన వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు 45 రోజుల పాటు పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌కు గ్రామ గ్రామాన ఘన స్వాగతం లభించింది. దారిపొడువునా ప్రజలు తమ బాధలు ప్రతిపక్ష నేతకు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరికి వైయస్‌ జగన్‌ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నేటితో ముగియనుంది. 
 

తాజా వీడియోలు

Back to Top