నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన

సదుం: మండలంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పర్యటించనున్నట్టు ఎంపీడీవో రోషన్‌జమీర్‌ తెలిపారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గ స్థాయి నెలసరి ఆదాయ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సదుం పంచాయతీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశంలో పలు శాఖలలో సంక్షేమ పథకాలలో లబ్దిదారులకు వాటిని పంపిణీ చేస్తారని వెల్లడించారు. అధికారులు హాజరు కావాలని కోరారు.

Back to Top