స్పీకర్ కు పెద్దిరెడ్డి లేఖ

హైదరాబాద్: స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ప్రవిలేజ్‌ కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ రాశారు. గత సెప్టెంబర్‌లో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న సభ్యుల విచారణలో కమిటీ సభ్యులు కలగజేసుకొని మాట్లాడటం సరికాదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖలో పేర్కొన్నారు. సభ్యుడు వివరణ ఇస్తుండగా.. 'మీరు తప్పుచేసి కమిటీ ముందుకు వచ్చారు' అని అనడం విచారకరం, బాధాకరం అన్నారు.

తోటి శాసన సభ్యులను బందిపోటు దొంగలంటూ పరోక్షంగా మాట్లాడటం కమిటీ గౌరవాన్ని కించపరిచేలా ఉందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ప్రివిలేజ్‌ కమిటీ సభ్యులు హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. సభ్యులు వివరణ ఇస్తున్నప్పుడు.. మధ్యలో కలగజేసుకొని, వారిని అగౌరవపరిచేలా మాట్లాడకుండా చూడాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్ కు సూచించారు. 
 
Back to Top