పెద్దిరెడ్డి చొరవతోనే నరేష్ విజయం!

 చిత్తూరు )
చిత్తూరు జిల్లా లో ఎమ్మెల్సీ గా నరేష్ కుమార్ రెడ్డి ఎన్నిక మీద వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యేదేశాయ్ తిప్పారెడ్డి స్పందించారు.  జోడు పదవులెందుకనే ఉద్దేశంతో ఎమ్మె ల్సీ
ఎన్నికపై అప్పీల్‌కు వెళ్లలేదని ఆయన తెలిపారు. తిప్పారెడ్డి మీద నరేష్ కుమార్
రెడ్డి ఎన్నికైనట్లుగా హైకోర్టులో తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా
ఉంటున్న తనకు ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తి లేకపోవడం, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న  కారణాలతోనే హైకోర్టులో ఉన్న ఎమ్మెల్సీ కేసుపై
అప్పీల్‌కు వెళ్లలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా పార్టీ సీనియర్ నేతల సలహాలు, సూచనల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్టు
పేర్కొన్నారు. పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజం పేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి
మిథున్‌రెడ్డి చొరవతోనే నరేష్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కిందని చెప్పారు.
అలాగే జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాల మేరకు తామీ నిర్ణయానికి వచ్చినట్టు
చెప్పారు. 

 

 

తాజా ఫోటోలు

Back to Top