రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌కు చంద్ర‌బాబు విధానాలే కార‌ణం..!


తిరుప‌తి) ప్ర‌భుత్వ విధానాల కార‌ణంగానే రాష్ట్రంలో రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. తిరుమ‌ల లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ఆయ‌న ద‌ర్శించుకొన్నారు. ఎన్నిక‌ల్లో రుణ మాఫీ ఇచ్చి, అధికారంలోకి వ‌చ్చాక ఆ హామీని తుంగ‌లోకి తొక్కార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లా ప్ర‌జ‌లు తెలుగుదేశాన్ని బాగా ఆద‌రించార‌ని, కానీ అక్క‌డ ప్ర‌జ‌ల్ని కూడా టీడీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న అన్నారు. అనంత‌పురం స‌హా ఇత‌ర జిల్లాల్లోని రైతుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకే పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ రైతు భ‌రోసాయాత్ర చేప‌ట్టార‌ని రామ‌చంద్రారెడ్డి అన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top