గోదావ‌రినే అమ్మేస్తున్న ఘ‌నుడు చంద్ర‌బాబు..!


అనంత‌పురం) ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా గోదావ‌రినే అమ్మేస్తున్నాడ‌ని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. గోదావ‌రి పుష్క‌రాల్లో భారీ అవినీతికి పాల్ప‌డిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే అని ఆయ‌న అన్నారు. అనంత‌పురం లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పుష్క‌రాల అవినీతి కోట్ల‌లోకి చేరిందని ఆయ‌న వివ‌రించారు. గోదావ‌రి లో నీటిని, ఇసుక‌ను అమ్మేసుకొంటున్న ఘ‌న‌త చంద్రబాబుకే ద‌క్కుతుంద‌ని రామచంద్రారెడ్డి అన్నారు. బాధ్య‌త‌గా ప‌నిచేసే అధికారులకు ఈ ప్ర‌భుత్వంలో రక్ష‌ణ లేద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. 
Back to Top