బాబు మాట‌లు సిగ్గుచేటు

హైదరాబాద్‌: ప్ర‌జ‌ల‌ను మోసం చేసి గెలిచిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విశ్వాసంతో విజ‌యం సాధించామ‌ని చెప్పుకోవ‌డం సిగ్గుచేట‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పెద్దిరెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. అధికార అహంతో చంద్ర‌బాబు పోలీసుల‌ను త‌న సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా వాడుకుంటున్నాడ‌ని విమ‌ర్శించారు. నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డింద‌న్నారు. ఉప ఎన్నిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌కు రూ. 2 నుంచి రూ.10 వేల వ‌ర‌కు పంచార‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల‌ను చంద్ర‌బాబు ఉల్లంఘించార‌న్నారు. పోలీసుల‌నే కాకుండా ఇంటెలీజెన్స్ చీఫ్‌ను కూడా ఎన్నిక‌ల్లో వాడుకున్నార‌న్నారు. చంద్ర‌బాబు ప‌రిపాల‌న చూసి ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌లేద‌ని, కేవ‌లం టీడీపీ నేత‌ల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డి ఓట్లు వేశార‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు క‌చ్చితంగా గుణ‌పాఠం చెబుతార‌న్నారు. 

Back to Top