అక్రమ అరెస్ట్ లకు నిరసనగా ధర్నా

తాడిపత్రి(అనంతపురం): జేసీ సోదరుల ఒత్తిడితోనే పోలీసులు తమ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని వైయస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దపప్పూరు మండలం దేవుని ఉప్పలపాడు గ్రామంలో సాయంత్రం గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వైయస్సార్ సీపీ కార్యకర్త రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపప్పూరు పోలీసు స్టేషన్ వద్ద కార్యకర్తలతో కలిసి పెద్దారెడ్డి ధర్నాకు దిగారు. వైయస్సార్ సీపీ కార్యకర్త రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Back to Top