బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ కు నివాళులుహైదరాబాద్: బాబు జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ద‌ళితులు, అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం నిరంత‌రం శ్ర‌మించిన మ‌హానీయుడు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌.కే. రోజా అన్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున, తెలంగాణ ఎస్సీ సెల్ చీఫ్ నల్లా సూర్య ప్రకాష్, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన త‌దిత‌రులు ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు ఆర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ... నాలుగు ద‌శాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా సేవ‌లు అందించి, కార్మిక‌, వ్య‌వ‌సాయ‌, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హించి ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన మ‌హానుభావుడు జ‌గ్జీవ‌న్ రామ్ అని వివ‌రించారు. బ‌ల‌హీన వ‌ర్గాల అభివృద్ధి కోసం కోసం నిరంతరం పాటుప‌డిన వ్య‌క్తి జ‌గ్జీవ‌న్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్ర‌మంలో ఇతర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అభిమానులు భారీగా పాల్గొన్నారు.

For Video : https://www.youtube.com/watch?v=TLA08XeWmc4
Back to Top