మహానేతకు నివాళి

వైయస్సార్‌ మరణంతోనే ప్రజలకు కష్టాలు
చెన్నూరు : ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న వైయస్‌ రాజశేఖరెడ్డి మరణంతోనే రాష్ట్ర ప్రజలకు కష్టాలు ఎదురయ్యాయని వైయస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్రప్రసాద్‌రెడ్డి, మండల పార్టీ కన్వినర్‌ జీఎన్‌ భాస్కర్‌రెడ్డిలు అన్నారు. వైయస్సార్‌ 8వ వర్దంతిని పురస్కరించుకొని శనివారం మండల పార్టీ కార్యాలయం వద్దనున్న వైయస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘణంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్‌ ప్రజల మనిషి అని ప్రజాసేవలోనే ప్రాణాలు అర్పించారని, ఆయన ఆశయాలు జగన్‌మోహన్‌రెడ్డితోనే నెరవేరుతాయన్నారు. వైయస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చీర్ల సురేష్‌యాదవ్, ఎంపీటీసీలు భాస్కర్‌రెడ్డి, నరసయ్యయాదవ్, నాయకులు పాలకొండారెడ్డి, శివారెడ్డి,రామ మనోహర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, వీరారెడ్డి, నరసింహారెడ్డి, చంద్రాయాదవ్, నాగిరెడ్డి, శీను, యర్రసాని మోహన్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, మన్నెం సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్‌రబ్, ఖరీం, రుహుల్లా, అన్వర్, నూరుల్లా, మున్నా సంపూర్ణారెడ్డిలు పాల్గొన్నారు.

రాయచోటి :రాయచోటిలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఆ మహానేతను ఎన్నిటికీ మరవలేమని ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహానేత రాయచోటి ప్రాంతానికి చేసిన అభివృద్ధిని, ప్రజలకు చేసిన సేవలను స్థానిక నాయకులతో కలిసి నెమరు వేసుకున్నారు. మా అందరికి ఆదర్శప్రాయుడైన వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించి 8 సంవత్సరాలు అవుతున్నా ఆయన చేసిన అభివృద్ధి, తాగునీటి సమస్యను శాశ్వతింగా పరిష్కరించి రాయచోటి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం రాయచోటి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని వైయస్సార్‌ విగ్రహానికి కౌన్సిలర్లు, నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఫయాజ్‌రహిమాన్, రిజ్వాన్, చాన్‌బాషా, నగేశం, కో–ఆప్షన్‌ సభ్యులు సలావుద్దీన్, మైనార్టీ నాయకులు చెన్నూరు అన్వర్‌బాషా(లయన్‌), మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అఫ్జల్‌అలీఖాన్, బీసీ విభాగం నాయకుడు విజయభాస్కర్, యువజన విభాగం పట్టణ కన్వీనర్‌ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైయస్‌ఆర్‌ చిరస్మరణీయుడు
సంబేపల్లె : దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖర్‌రెడ్డి తన శేష జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేసి ప్రజల్లో చిరస్మరణీయుడిగా మిగిలారని మండల వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్‌ఆర్‌ హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. మండలంలోని దేవపట్లలో మండల కన్వీనర్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి వైఎస్‌ఆర్‌కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 



Back to Top