మ‌హానేత‌కు కుటుంబసభ్యుల నివాళి

ఇడుపులపాయలోని వైయ‌స్‌ఆర్ ఘాట్ వద్ద కుటుంబ స‌భ్యుల నివాళి  

వైయ‌స్ఆర్ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి ఘంటించారు.  ఇడుపులపాయలోని వైయ‌స్‌ఆర్ ఘాట్ వద్దకు శనివారం ఉదయాన్నే వైయ‌స్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆయన తల్లి, పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజయమ్మ, సతీమణి వైయ‌స్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్‌ అనీల్‌ కుమార్‌, వైయ‌స్‌ వివేకానందరెడ్డి, వైయ‌స్ఆర్‌ సోదరుడు దివంగత వైయ‌స్ జార్జిరెడ్డి సతీమణి వైయ‌స్ భారతమ్మ, ఎంపీలు వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి,  మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైయ‌స్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మ‌హానేత అభిమానులు వ‌ర్ధంతి వేడుక‌లు నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్ విగ్ర‌హాల‌కు పాలాభిషేకం చేసి, పూల‌మాల‌ల‌తో నివాళుల‌ర్పించారు. 

తాజా ఫోటోలు

Back to Top