తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి

విజయనగరంః
ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్ర ఇబ్బందులు
సృష్టిస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ
వీరభద్రస్వామి మండిపడ్డారు. గత సంవత్సరం మాదిరే ఈసారి కూడా ధాన్యం
కొనుగోళ్లు జరగక రైతులు ఇక్కట్లు పడుతున్నారని వారు అన్నారు. వెంటనే
ధాన్యం కొనుగోళ్లు చేయడంతో పాటు వెనువెంటనే పేమెంట్ చెల్లేవిధంగా చర్యలు
తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ను కలిసి విజ్ఞప్తి చేెశారు. 

రైతులు
ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే వాటిని అమ్ముకోలేని దుస్థితిని ప్రభుత్వం
కల్పిస్తోందని నేతలు ఫైరయ్యారు. కొనుగోలు కేంద్రాలు తెరిచి కూడా రైతుల
పంటను కొనకుండా ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేస్తుందని ఆవేదన వ్యక్తం
చేశారు. వర్షం వచ్చి ఎక్కడ ధాన్యం తడుస్తుందోనని రైతులు
భయపడుతున్నారన్నారు. నెలరోజులు దాటినా కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై
 జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

రైస్
మిల్లర్స్ కొనకుండా ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు
జేస్తున్నారని నేతలు మండిపడ్డారు. అధికార యంత్రాంగం రైతులు నష్టపోకుండా
చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా త్వరతిగతిన
రైతులకు పేమెంట్స్ వచ్చేవిధంగా చూడాలన్నారు. అదేవిధంగా పర్చేజ్ సెంటర్లు
పెంచాలని జాయింట్ కలెక్టర్ కు విన్నవించారు. 
Back to Top