పవన్ పెయిడ్ యాక్షన్!

జనసేన పార్టీ
అధ్యక్షుడు,
సినీ హీరో పవన్ కల్యాణ్ గంటసేపు సాగించిన విలేకరుల సమావేశంలో మౌలికమైన
అనేక అంశాల్ని వదిలేసి, అసలు విషయాలన్నిటినీ దాచేసి గందరగోళం
చేశారు. ఒక విధంగా చెప్పాలంటే  తెలుగుదేశం అధినేత
నారా చంద్రబాబు నాయుడు తరపున రాసిచ్చిన స్క్రిప్టును పవన్ కల్యాణ్ సరిగ్గా చదవలేకపోయారు.
సమకాలీన రాజకీయాలను కుదిపేస్తున్న ఓటుకు కోట్లు అంశాన్ని ప్రస్తావించకుండా పవన్ కల్యాణ్
పరోక్షవ్యాఖ్యలు చేయడం... అది కూడా చంద్రబాబునాయుడుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ఊహించనిదేమీ
కాదు. అసలు ఈ ప్రెస్‌కాన్ఫరెన్స్‌కి నిర్మాత, కథ, సంగీతం, మాటలు, స్క్రీన్‌ప్లే,
డెరైక్షన్ మొత్తం చంద్రబాబునాయుడేనన్న విషయం అర్ధమవుతూనే ఉంది.  చంద్రబాబు నాయుడు తరఫున రాసిన స్క్రిప్టులో సెక్షన్
-8 గురించి పవన్ కల్యాణ్ బాగానే ప్రస్తావించారు కానీ అసలు సెక్షన్
-8లో ఏముందో ఆయనకు తెలిసినట్లు లేదు. అలాగే ఏసీబీ కేసుకు సీబీఐ
కేసుకు తేడా కూడా పవన్‌కల్యాణ్‌కి తెలిసినట్లు లేదు. సోమవారం నాటి విలేకరుల సమావేశం
చూసిన తర్వాత పవన్ కల్యాణ్ అభిమానుల్లో కూడా అనుమానాలు బయల్దేరాయి. అసలీయన ఏం మాట్లాడాలనుకున్నాడు?
ఏం మాట్లాడాడు? వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన
దొంగలను ఇలా ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? అనే ప్రశ్నలు సగటు అభిమానులను
కుదురుగా కూర్చోనీయడం లేదు. అందుకే పదవుల కోసం కాదు.. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టా
అని ప్రకటించుకున్న పవన్‌కల్యాణ్‌కి కొన్ని ప్రశ్నలు...

 - ఫోన్ ట్యాపింగ్‌నేరం అన్న విషయాన్ని
పవన్ కల్యాణ్ బాగానే చెప్పారు కానీ దానికి ముందు 50 లక్షల రూపాయల
డబ్బు లంచంగా ఇస్తూ వీడియో కెమెరాలకు అడ్డంగా దొరికి పోయిన రేవంత్‌రెడ్డి గురించి,
ఆ డబ్బు గురించి పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? ట్యాపింగ్‌నేరం
కాదని ఎవరన్నారు?

 - ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు?
ట్యాపింగ్ జరగలేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర సంస్థలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ట్యాపింగ్ ఆధారాలుంటే ఎందుకు బయటపెట్టడం లేదు?

 - చంద్రబాబు నాయుడు స్టీఫెన్ సన్‌కు
ఫోన్ చేయడం నేరమా? లేకపోతే ఆ ఫోన్ సంభాషణలని స్టీఫెన్‌సన్ రికార్డు
చేయడం నేరమా?

 - పవన్‌కల్యాణ్ గంటసేపు అనేక అంశాలపై
మాట్లాడారు కానీ ఇంతకీ రేవంత్‌రెడ్డి దొంగా దొరా? రేవంత్‌ను పంపింది
చంద్రబాబు అవునా కాదా?

 - చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని
తెలుగుదేశం పార్టీ అధినేతగా నడిపాడా లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నడిపాడా?
చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా వ్యక్తిగత స్థాయిలో చేసిన నేరానికి ఆంధ్రప్రదేశ్
ప్రజలకు మధ్య ఏమిటి సంబంధం?

 - రాజధాని కోసం తెలుగుదేశం పార్టీ
ల్యాండ్‌పూలింగ్ చేస్తే తప్పు లేదు కానీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే మాత్రం ఊరుకోను
అని ప్రకటించిన మీరు .. చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్‌కు నోటిఫికేషన్ ఇస్తుంటే
ఎందుకు నోరు మెదపడం లేదు?

 - ఆంధ్రప్రదేశ్‌లో రైతుల అప్పులు చంద్రబాబు
నాయుడు ప్రభుత్వం వచ్చాక రు.10,000 కోట్లకు పైగా పెరిగింది. వ్యవసాయ
రుణాలన్నీ మాఫీ చేస్తానని రైతులందరినీ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ
చేస్తానని మహిళలందరినీ, ఇంటికో ఉద్యోగం ఇస్తా.. లేదంటే రు.2000 నిరుద్యోగ భృతి ఇస్తా ..అని ఈ రోజు వరకు అణాపైసా కూడా చెల్లించకుండా ఆంధ్రప్రదేశ్
ప్రజలందరినీ, అన్ని సామాజిక వర్గాలను చంద్రబాబు వంచించాడని చెప్పడానికి
ఏడాది దాటినా మీకు ఎందుకు నోరు పెగలడం లేదు?

 - ఈ హామీలన్నీ అమలు చేయించే బాధ్యత
నాది అని చంద్రబాబు సమక్షంలో, మోడీ సమక్షంలో గొంతు చించుకుని
మరీ జనం చేత ఓట్లేయించిన పవన్ కల్యాణ్ నేడు ఆ హామీలు అమలు కోసం ఎందుకు మాట్లాడడం లేదు?
వారు మీకిచ్చిన హామీలన్నీ నెరవేరిపోయాయని జనం అనుకోవడం తప్పెలా అవుతుంది.
ఇంతకీ మీరు ప్రీపెయిడా..? పోస్ట్‌పెయిడా..?

 - ప్రత్యేక హోదా ఇస్తాం, ప్యాకేజీలిస్తాం అని హామీ ఇచ్చింది బీజేపీ, టీడీపీ. సీమాంధ్ర
ఎంపీలు అడిగారా లేదా అన్నది చెత్త ప్రశ్న. మీరు నాయుళ్లను బోనులో పెట్టాలిగదా?
చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు ఆరోజు ఈ హామీలిచ్చారు.
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వెంకయ్య నాయుడు
బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన కాకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా. వీరి
పేర్లు ఎత్తే సాహసం చంద్రబాబు నాయుడుకు ఎందుకు లేకపోయింది? ఆ
ధైర్యం మీకు ఎందుకు లేకపోయింది?

 - ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇంకా రాలేదని
మీరు చెప్పడం దివాలాకోరు వాదన. పరోక్ష అధికారం. పరోక్ష నటన అంత మంచివి కాదు. ప్రత్యక్ష
రాజకీయాల్లోకి రాకుండా, తప్పు చేస్తున్నవారిని ప్రశ్నించే ధైర్యం
చేయకుండా ఈ నకిలీ ప్రెస్‌మీట్లు, పెయిడ్ ప్రెస్‌మీట్లు ఎవరిని
మోసం చేయడానికి?

 - ఒక్క విషయం సూటిగా చెప్పండి మీరు
సినిమా పెయిడ్ ఆర్టిస్టా..? రాజకీయ పెయిడ్ ఆర్టిస్టా..?

Back to Top