ఇంకెప్పుడు ప్ర‌శ్నిస్తావ్‌

రాజ‌మండ్రి: ప్రశ్నించడానికే జనసేన పార్టీ అని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్... రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ‌మండ్రి సిటీ క‌న్వీన‌ర్‌ కందుల దుర్గేష్ నిల‌దీశారు. చంద్ర‌బాబు ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నా..ప‌వ‌న్ ఇంకెప్పుడు ప్ర‌శ్నిస్తావ‌ని ఆయ‌న కడిగిపారేశారు.  మంగ‌ళ‌వారం రాజ‌మండ్రిలో కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి, పార్టీ మారిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టిందని మండిప‌డ్డారు. పార్టీ మారిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం అత్యంత దారుణం అని ఆయ‌న ఖండించారు.  

Back to Top