టీడీపీ అధికార ప్రతినిధిగా పవన్ కల్యాణ్..!

ప్రశ్నించడం మానేసి టీడీపీతో రాజీ..!
జనసేనను నమ్ముకొన్నవారి ఆశలు అడియాశలు..!

హైదరాబాద్ః
ప్రశ్నించడానికే ఏర్పాటైన రాజకీయ పార్టీ ప్రశ్నించడం మానేసి  చంద్రబాబుతో
రాజీ ధోరణి అవలంభిస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
పవన్ కల్యాణ్ ను దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యల మీద
చంద్రబాబును ప్రశ్నిస్తాడని అందరూ ఎందురు చూశారని, కానీ పవన్ కల్యాణ్ అవేమీ
ప్రశ్నించకుండా నిరాశపర్చారని ఎద్దేవా చేశారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో
సమస్యలు చెప్పుకుందామని వచ్చిన రైతులనూ పట్టించుకోకుండా...  ఫ్లైట్ దిగి
కారెక్కి పవన్ కల్యాణ్ చంద్రబాబు దగ్గరకు వెళ్లిపోయాడన్నారు. 

ప్రజల
దృష్టి మరల్చడానికే చంద్రబాబు- పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని అంబటి రాంబాబు
ధ్వజమెత్తారు. వీరిద్దరి భేటీ అంతా డ్రామాగా ఉందని, చంద్రబాబు అధికార
ప్రతినిధిగా పవన్ కల్యాణ్ మాట్లాడారని అంబటి విమర్శించారు.  తెలుగుదేశం
పార్టీకి అనుబంధ సంస్థగా మార్చేందుకే పవన్ కల్యాణ్ చంద్రబాబుతో
సమావేశమయ్యారని ఎత్తిపొడిచారు. పవన్ కల్యాణ్ ను నమ్మి జనసేన మీద ఆశలు
పెట్టుకున్న వారంతా ..ఎందుకు మారిపోయారో అర్థంకాక
కొట్టుమిట్టాడుతున్నారన్నారు. 

తన వద్ద డబ్బులు
లేవని చెప్పిన పవన్ కల్యాణ్ ప్రత్యేకవిమానంలో ఎవరి ఖర్చులతో వెళ్లారో
ప్రజలకు చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సొమ్మా లేక కాజేసిన
సొమ్మాఅని నిలదీశారు.  చంద్రబాబుతో లాలూచీ పడి ప్రశ్నించడం మానేసిన  పవన్
కల్యాణ్ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని అంబటి హితవు పలికారు.  

తాజా వీడియోలు

Back to Top