పట్టిసీమ పోలవరంలో భాగం కాదున్యూఢిల్లీ) పట్టి సీమ మీద చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు బట్టబయలు
అయ్యాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అన్నది పోలవరం ప్రాజెక్టులో భాగం కానే కాదని
కేంద్ర జల వనరుల శాఖ కుండ బద్దలు కొట్టింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన
ప్రశ్నకు కేంద్రం నుంచి ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం అందింది. కేంద్రం వద్ద ఉన్న
డీ పీ ఆర్ లో పట్టిసీమ గురించి లేదని స్పష్టం చేసింది. ఇప్పటి దాకా పట్టిసీమ కూడా
పోలవరంలో భాగమే అని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వాదన వట్టిదే అని తేలిపోయింది.

 

Back to Top