వాణిజ్య అవ‌స‌రాల కోస‌మే ప‌ట్టిసీమ‌

ఏలూరు: పట్టిసీమ అన్న‌ది వాణిజ్య అవ‌స‌రాల కోస‌మే అని వైయ‌స్సార్సీపీ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు ఆళ్ల‌నాని అభిప్రాయ ప‌డ్డారు. దీని నుంచి రాయలసీమకు నీటిని తరలిస్తానని చెబుతున్న టీడీపీ సర్కారు రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలకు నీటిని అమ్ముకోవాలని చూస్తోందని ఆయ‌న‌ ఆరోపించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ముఖ్య కేంద్రం ఏలూరు లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 
వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ఆళ్ల నాని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు పెట్టిన రూ.1500 కోట్ల ఖర్చును పోలవరంకు పెట్టివుంటే ప్రాజెక్టు ముందుకెళ్లేదన్నారు. గోదావరి రైతుల పొట్టకొట్టి అడ్డగోలుగా నీటిని తరలించుకుపోతున్నారని విమర్శించారు. 
Back to Top