పిట్ట‌ల్లా రాలుతున్న ప్రాణాలు

  • అనంత ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మరణ మృదంగం..13మంది మృతి
  • మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలి
  • వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి
అనంత‌పురంః ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం 13 మంది ప్రాణాల‌ను బ‌లిగొంది. అనంత‌పురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో 13 మంది రోగులు మృత్యువాత ప‌డ్డారు. దీంతో హాస్పిటల్‌ వద్ద  మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యులు, ప్ర‌భుత్వ నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదు. గుండెజబ్బు, ఊపిరితిత్తులు, రక్తహీనత, టీబీ వంటి వ్యాధులతో బాధపడే వారు ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు  మృతి చెందారు. గ‌తంలో ఎన్న‌డూలేన‌ట్లుగా ప‌దుల సంఖ్య‌లో చ‌నిపోతున్నా.. రాష్ట్ర ఆరోగ్య‌శాఖ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. 

వైయస్‌ఆర్సీపీ ఆందోళన
అనంతపురం ప్రభుత్వాస్పత్రిని స్థానిక వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి పరిశీలించారు. మృతుల బంధువులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. ప‌దుల సంఖ్య‌లో రోగులు చ‌నిపోతున్నా ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మండిప‌డ్డారు. 
Back to Top