'పథకాల అమలు నిల్‌‌ ... కష్టాలు ఫుల్'

చేవెళ్ల, 27 ఏప్రిల్‌ 2013: మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలూ తమకు సక్రమంగా అందేవని చేవెళ్ళ ప్రజలు చెప్పారు. ఆయన మరణానంతరం ఏ పథకమూ అందక తమ జీవితాలు దుర్భరంగా మారిపోయాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ చేవెళ్ళలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అధికంగా వచ్చిన కరెంట్ బిల్లులను‌ ఒకరు చూపిస్తే... పింఛన్లు రావటం లేదని వృద్ధులు కన్నీరు పెట్టారు. ఏం తినాలి, ఎట్లా బతకాలని వారు ఆవేదన చెందారు. పార్టీ మీటింగులకు వెళ్ళలేదని తమకు ఇచ్చే పింఛన్‌ను కట్‌ చేయడం ఏ విధంగా సమజసం అంతుందని ఒక వృద్ధురాలు మొరపెట్టుకున్నది.

మహానేత డాక్టర్ వై‌యస్ బతికి ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కావన్నారు. వైయస్‌ఆర్ కుటుంబం మాట ఇస్తే త‌ప్పదని ఆమె చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సిఎం అయితే పథకాలన్నింటిని సక్రమంగా అమలు చేస్తారని భరోసా ఇచ్చారు. పిల్లలను పాఠశాలకు పంపిస్తే అమ్మ బ్యాంకు ఖాతాలోకి నేరుగా ప్రోత్సాహకంగా డబ్బులు జమచేస్తారని హామీ ఇచ్చారు. వైయస్‌ పథకాలన్నింటినీ శ్రీ జగన్‌ అమలు చేస్తారని హామీ ఇచ్చారు.

రూ.1 కిలో బియ్యం ఇస్తున్నప్పటికీ కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో జీవితం దుర్భంగా మారిపోయిందని చేవెళ్ళ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌ సరిగా అందడంలేదని ఫిర్యాదు చేశారు. తమకు ఏ కష్టాలు వచ్చినా వైయస్‌ రాజశేఖరరెడ్డి తమ దగ్గరకు వచ్చేవారన్నారు. ఇప్పటి పాలకులు తమ సమస్యలు పట్టించుకోవడమే లేదని ప్రజలు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. తాగునీరు, డ్రైనేజీ, రేషన్‌కార్డు, అమ్మ హస్తం సరుకులు ఇవ్వడం లేదని వారు తెలిపారు. తమ పిల్లలకు ఫీజు రీయింబర్సుమెంట్‌ రావడంలేదని కొందరు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వృద్ధులకు పింఛన్లు పెంచుతారని శ్రీమతి విజయమ్మ వారికి హామీ ఇచ్చారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం నీరుగారుస్తున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

తాజా వీడియోలు

Back to Top