వైయస్‌ జగన్‌ను కలిసిన పాస్టర్లు

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చీమకుర్తి మండలంలో ప్రకాశం జిల్లా పాస్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పాస్టర్స్‌ అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ..గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పాస్టర్లు, మసీదు మౌజమ్‌లకు గౌరవవేతనం ఇవ్వాలని మహానేత ఆలోచన చేశారన్నారు. మహానేత మరణాంతరం పాస్టర్లను పట్టించుకోవడం లేదని చెప్పారు. నిత్యం దేశ, రాష్ట్ర  ప్రజల క్షేమం కోసం పాస్టర్లు ప్రార్థనలు చే స్తున్నారన్నారు. ఇదే విషయాన్ని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో 600 మంది పాస్టర్లు ఉన్నారని వివరించారు. యువనేత వైయస్‌ జగన్‌ రాష్ట్రానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. చరిత్రలో ఈయన మాదిరిగా ప్రజలతో మమేకమవుతూ పాదయాత్ర చేసిన నేతను చూడలేదన్నారు. ప్రతి  ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. తమ సమస్యలు పరిష్కారమవుతాయని పాస్టర్స్‌ అసోసియేషన్‌ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. 

 
Back to Top