పోరుబాటతోనే పటిష్టం

హైదరాబాద్) ప్రజా సమస్యల మీద పోరాటాన్ని
ఉధృతం చేస్తామని, ఈ పోరాటాలతోనే పార్టీని పటిష్టం చేసుకొంటామని వైయస్సార్సీపీ తెలంగాణ
రాష్ట్ర శాఖ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోటస్
పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. వైయస్‌ఆర్‌ చేపట్టిన ప్రతీ సంక్షేమ పథకం పార్టీకి సిద్ధాంతంగా, పునాధులుగా నమ్ముకున్నామని చెప్పారు. రైతు, కార్మిక, యువత శ్రేయస్సు కోసం, మహిళల రక్షణ, అభివృద్ధి కోసం స్వర్గీయ వైయస్‌ఆర్‌ పాటుపడ్డారని గుర్తు చేశారు. తనను అధ్యక్షుడిగా నియమించిన తరువాత పార్టీ సంస్థాగత నిర్మాణాలపై దృష్టి పెట్టామని చెప్పారు. తెలంగాణలో 10 జిల్లాలకు గానూ ఇప్పటికే 9 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా 7 జిల్లాల్లో పార్టీ కమిటీ కూడా పూర్తవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు, దివంగత వైయస్‌ఆర్‌ అభిమానులు, పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు పార్టీ అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. ఈ నెల 18వ తేది నుంచి 28వ తేది వరకు పూర్తిస్థాయి మండల కమిటీలను నియామకాలు జరపాల్సిందిగా పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మండల, గ్రామస్థాయి నాయకుల అభిప్రాయాల మేరకు, వైయస్‌ఆర్‌ సీపీ పటిష్టతకు, వైయస్‌ఆర్‌ ఆశయ సాధన కోసం కృషి చేసే వ్యక్తులకు కమిటీల్లో స్థానం కల్పించాలని కోరారు. వైయస్‌ఆర్‌ పథకాలను వివరిస్తూ, పార్టీ అభివృద్ధి, బలోపేతానికి పాటుపడాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. 


తమ పార్టీ వీడి టీఆర్‑ఎస్‑లో చేరిన నేతలు ఇప్పుడు అవమానాలకు
గురవుతున్నారన్నారు. ఈ నెల 18 నుంచి 28 వరకు వైఎస్సార్‑సీపీ అన్ని
మండల శాఖల నియామకాలు పూర్తి చేస్తామని గట్టు శ్రీకాంత్‑రెడ్డి అన్నారు

Back to Top