గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

రొంపిచెర్ల: గ్రామస్థాయిలో వైయస్ఆర్సీపీని బలోపేతం చేయాలని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ చెంచురెడ్డి నివాసంలో మండలంలోని ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్నారు. కార్యకర్తలు దీనిని దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మండలంలో కార్యకర్తలు అందరు కలసి కట్టుగా పని చేసి పట్టు నిలుపుకోవాలన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో కొందరి నాయకుల వలన మండలాన్ని చేజేతులా వదులుకున్నామని గుర్తు చేశారు. దీని వలన సామాన్య కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇక మీదట ఎక్కడ చిన్న తప్పులు కూడ జరగరాదన్నారు.  ప్రతి కార్యకర్త సైనికుడై పొరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆనారోగ్యంతో బాధ పడుతున్న మాజీ ఎంపీపీ సిద్దమ్మను పరమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top