నంద్యాలకు ఏం చేస్తామో సభలో చెప్తాం..?

కర్నూలుః నంద్యాలలో  (గురువారం) ఎస్పీజీ గ్రౌండ్స్‌లో జరిగే వైయస్‌ఆర్‌ సీపీ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ పాల్గొంటారని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. రేపటి సభలో వైయస్ జగన్‌ సమక్షంలో శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీలో చేరతారని చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి  ఈ నెల 4న నామినేషన్‌ దాఖలు చేస్తారన్నారు. 

శిల్పా చక్రపాణిరెడ్డికి ఏ పదవి ఆశ చూపలేదని అన్నారు. మూడేళ్లుగా చంద్రబాబుకు నంద్యాల గుర్తుకు రాలేదా, ఉప ఎన్నిక రాగానే ఆయనకు నంద్యాల గుర్తుకొచ్చిందా అని బొత్స ప్రశ్నించారు. నంద్యాలకు, మైనార్టీలకు తాము ఏం చేస్తామో రేపు వైయస్‌ జగన్‌ చెప్తారని, తాము చేసేదే చెప్తామని, చెప్పిందే చేసి చూస్తామన్నారు. చంద్రబాబులాగా నేతలకు గాలం వేయమని బొత్స సత్యానారాయణ అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top