జూలై 16 నుంచి పార్టీ జిల్లా స‌మీక్షా స‌మావేశాలు

హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స‌మీక్షా స‌మావేశాలు ఈ నెల 16 నుంచి 20 తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్ లోట‌స్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రుగనున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు  గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ స‌మీక్షా స‌మావేశాల‌కు అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. రోజుకు మూడు జిల్లాల చొప్పున ఉద‌యం 11 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స‌మావేశాలు జ‌రుగుతాయి. స‌మావేశాలు వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. 

జూలై 16న - న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, రంగారెడ్డి జిల్లాలు
18న - నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ జిల్లాలు
19న‌ - గ్రేట‌ర్ హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్ జిల్లా
20న - మెద‌క్‌, ఖ‌మ్మం జిల్లాలు

రాష్ట్రంలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, మండ‌ల స్థాయి క‌మిటీల నియామ‌కంపై ఈ స‌మావేశాల‌లో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ స‌మీక్షా స‌మావేశాల‌కు ఆయా జిల్లాల పార్టీ ప‌రిశీల‌కులు, జిల్లా పార్టీ స‌హ‌ప‌రిశీల‌కులు, జిల్లా పార్టీ అధ్య‌క్ష‌లు, రాష్ట్ర క‌ర్య‌ద‌ర్శులు, రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శులు, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్య‌క్షులు,, జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు మాత్ర‌మే హాజ‌ర‌వ్వాల‌ని పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అధికార ప్ర‌తినిధి కొండా రాఘ‌వ‌రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
Back to Top