సంస్థాగ‌త ప‌టిష్ట‌త - జిల్లా ప‌రిశీల‌కుల నియామ‌కం

హైద‌రాబాద్‌) ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ప్ర‌జ‌ల త‌ర‌పున చురుగ్గా పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ సంస్థాగ‌తంగా పార్టీని ప‌టిష్ట ప‌ర‌చుకొంటూ ముందుకు సాగుతోంది. పార్టీలో అంత‌ర్గ‌తంగా తీసుకొని రావాల్సిన మార్పుల గురించి కొంత కాలంగా పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ సీనియ‌ర్ నాయ‌కుల‌తో చ‌ర్చిస్తూ వ‌చ్చారు. ప్ర‌తీ జిల్లాకు ప‌రిశీల‌కుడిని నియ‌మించి పార్టీ కార్య‌క‌లాపాల‌కు మ‌రింత‌గా ఉత్తేజం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. సీనియ‌ర్ నాయ‌కులకు ఈ బాధ్య‌త అప్ప‌గించ‌టం ద్వారా పార్టీ జిల్లా స్థాయి యంత్రాంగాన్ని ప‌టిష్టం చేయ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాల ప‌రిశీల‌కుల్ని నియ‌మించారు

రాష్ట్ర బంద్ మీద దృష్టి
ప్ర‌త్యేక హోదా మీద నిరంత‌ర పోరులో భాగంగా ఈనెల 29న బంద్ నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఈ బంద్ కు సంబంధించి తీసుకోవాల‌సిన చ‌ర్య‌ల్ని పార్టీ అగ్ర నాయ‌క‌త్వం ప‌ర్య‌వేక్షించ‌నుంది. ఈ స‌న్నాహాల్లో భాగంగా కొత్త‌గా నియ‌మితులైన పార్టీ ప‌రిశీల‌కుల మొద‌టి స‌మావేశం ఈ నెల 18న  జ‌ర‌గ‌నుంది.  మంగ‌ళ‌వారం ఉద‌యం 11గంట‌ల‌కు జ‌రిగే సమావేశంలో బంద్ ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల్ని స‌మాయ‌త్తం చేయ‌టం వంటి అంశాల‌పై దృష్టి పెడ‌తారు. 

జిల్లాల వారీగా ప‌రిశీల‌కులు
శ్రీ‌కాకుళం - ఆర్ వీ ఎస్ ఎస్ కే రంగారావు(బేబీ నాయ‌న‌), విజ‌య న‌గ‌రం - ధ‌ర్మాన కృష్ణ దాస్‌, విశాఖ ప‌ట్ట‌ణం - వి. విజ‌య‌సాయి రెడ్డి, తూ. గోదావ‌రి - ధ‌ర్మాన ప్ర‌సాదరావు, ప‌. గోదావ‌రి - పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, కృష్ణా - పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, గుంటూరు - బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌కాశం - డి.సి. గోవింద‌రెడ్డి, నెల్లూరు - వై. వి. సుబ్బారెడ్డి, క‌ర్నూలు - అనంత వెంక‌ట్రామిరెడ్డి, వైఎస్సార్ జిల్లా - వైఎస్ అవినాష్ రెడ్డి, మేరుగ నాగార్జున‌, సురేష్ బాబు, అనంత‌పురం - పి. మిథున్ రెడ్డి, చిత్తూరు - పి. ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి 
Back to Top