శేషుబాబు నియామకం పట్ల హర్షం

తూర్పుపాలెం(పోడూరు):  వైయ‌స్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబును నియమించడం పట్ల తూర్పుపాలెం గ్రామానికి చెందిన పలువురు వైయ‌స్‌ఆర్ సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న శేషుబాబుకు పార్టీలో మరింత భాద్యతాయుతమైన  పదవిని ఇవ్వడం మంచి పరిణామమని మండల బీసీసెల్‌ అధ్యక్షుడు గుబ్బల వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కడలి త్రిమూర్తులు, పెచ్చెట్టి వనమయ్య, గొట్టుముక్కల ఏసురత్నం, ఇర్రింకి శ్రీను తదితరులు శేషుబాబు నియామకం పట్ల హర్షం తెలిపినవారిలో ఉన్నారు. 

Back to Top