అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరుకండి

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న డాక్టర్‌.బీ.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హజరుకావాలని ఆ పార్టీ రాష్ట్ర హైపవర్‌ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. స్థానిక రైతు బజారు ఆవరణంలోగల అంబేధ్కర్‌ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని ఉదయం 9గంటలకు ఆ ప్రాంతానికి అందరూ హాజరులు కావాలని ఆయన తెలిపారు.

Back to Top