విజ‌య‌వాడ స‌మావేశం ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

విజయవాడ: ఎల్లుండి మంగ‌ళ‌వారం నాడు వైయ‌స్సార్సీపీ రాష్ట్ర విస్త్ర‌త‌స్థాయి స‌మావేశానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్ల‌ను పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఆదివారం పరిశీలించారు. ఈ నెల 14న విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల పనులను ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, రక్షణ నిధితో పాటు పార్టీ నేతలు పార్థసారధి, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి పలువురు నేతలు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వెయ్యి అబద్ధాలు చెప్పిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీను చంద్రబాబు సర్కార్ నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top