పార్టీ లో సంస్థాగ‌త నియామ‌కాలు

హైదరాబాద్:  వైయ‌స్సార్సీపీ ను సంస్థాగ‌తంగా ప‌టిష్టం చేసుకోవ‌టంలో భాగంగా సంస్థాగ‌త నియామ‌కాలు చేప‌ట్టింది. 
 సంస్థాగత పదవుల్లో పలువురిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి(ఏలూరు) నియమితులయ్యారు. ఇప్ప‌టిదాకా రాష్ట్ర మ‌హిళా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అనేక ప్ర‌జా పోరాటాలు చేశారు. ముఖ్యంగా కాల్ మ‌నీ సెక్సు రాకెట్ కుంభ‌కోణం మీద టీడీపీ నాయ‌కుల బండారాన్ని బ‌య‌ట పెట్ట‌డంలో కృషి చేశారు.
  రాష్ట్ర యువజన, విద్యార్థి విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను ఎమ్మెల్సీ, విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామికి అప్పగించారు. కొంత కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల్ని ప‌టిష్టం చేస్తూ అనేక కార్య‌క్ర‌మాల‌కు వీరభ‌ద్ర స్వామి సార‌థ్యం వ‌హిస్తున్నారు. గ‌తంలో ఎమ్మెల్యేగా ప‌నిచేశారు.
శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతిని పాతపట్నం నియోజకవర్గం సమన్వయకర్తగా నియ‌మించారు. గ‌తంలో శ్రీకాకుళం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేశారు. పార్టీ కార్య‌క్ర‌మాల్ని ఆమె స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిస్తున్నార‌నే పేరు ఉంది.
కావటి శివ నాగ మనోహర్ నాయుడును గుంటూరు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. గ‌తంలో గుంటూరు సిటీలో రెండు ప‌ర్యాయాలు కార్పొరేట‌ర్ గా ప‌నిచేసి ఫ్లోర్ లీడ‌ర్ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. వైయ‌స్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ప్ర‌స్తుతం యువ‌జ‌న విభాగం జిల్లా అధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 కర్నూలు జిల్లా 
పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గుండం సూర్యప్రకాష్ రెడ్డి(బనగానపల్లి), రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా పోచా.శీలారెడ్డి(బనగానపల్లి), జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్(కర్నూలు), జిల్లా అధికార ప్రతినిధిగా సిద్ధారెడ్డి రామ్మోహన్‌రెడ్డి(బనగానపల్లి), జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా జి.అయ్యపురెడ్డి(బనగానపల్లి)లు నియమితులయ్యారు.
 ప్రకాశం జిల్లా నుంచి
రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా సలగాల అమృతరావు(చీరాల), జిల్లా విద్యార్థి విభాగం సహాయ కార్యదర్శిగా పెర్లి రిచ్చి(చీరాల), కార్యవర్గసభ్యులుగా చీరాలకు చెందిన యామర్తి అజైల్ రాయ్, దాసరి వినోద్, కాగిత సందీప్, నల్లమేకల రాజేష్ యాదవ్, బండి బాలశంకరరావులు నియమితులయ్యారు. వేటపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా కొలుకుల వెంకటేశ్, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడిగా కుంచాల ఏడుకొండలరెడ్డి, చీరాల మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఆట్ల రూపేంద్రరెడ్డి, చీరాల పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షురాలిగా బిళ్ల వినీత్నలు నియమితులయ్యారు.
 శ్రీకాకుళం జిల్లా నుంచి
పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా శిర్ల రామారావు(శ్రీకాకుళం), నందిగాం మండల పార్టీ అధ్యక్షుడిగా బొమ్మిలి లక్ష్మీనారాయణ(టెక్కలి), ఇచ్ఛాపురం పట్టణ శాఖ అధ్యక్షుడిగా కళ్ళ దేవరాజ్‌లను నియమించారు.

తాజా వీడియోలు

Back to Top