వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములుగా కావాలి

తుగ్గలి : వైయస్సార్‌ కుటుంబంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆ పార్టీ మండల కన్వీనర్‌ జిట్టా నాగేష్, సింగిల్‌విండో అధ్యక్షుడు ప్రహ్లాదరెడ్డి కోరారు. గురువారం మండలంలోని ఉప్పర్లపల్లి, కడమకుంట్ల గ్రామాల్లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం జరిగింది. ఉప్పర్లపల్లిలో పార్టీ యువజన నాయకుడు సురేంధ్రనాథరెడ్డి, సర్పంచ్‌ ఓబులేసు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ దుష్ట పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయటమే వైయస్సార్‌ కుటుంబం అన్నారు. మండలంలోని ప్రతి కుటుంబాన్ని వైయస్సార్‌ కుటుంబంలో చేర్చడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లు, కార్యవర్గ సభ్యులు ముందుకు సాగాలన్నారు. టీడీపీ పాలనతో అన్ని వర్గాల ప్రజలు మోస పోయారని అందుకే వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమానికి ప్రజలు చేరువకావటానికి ముందుకు వస్తున్నారన్నారు. ప్రతి కుటుంబం వైయస్సార్‌ కుటుంబంలో చేరి తమ సమస్యలను 9121091210 నంబరుకు మిస్డ్‌కాల్‌ ఇచ్చి తమ సమస్యలను పార్టీ అధినేతకు తెలపాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు జగదీష్‌ నాయక్, కడమకుంట్ల ఎంపీటీసీ సభ్యుడు రామాంజినేయులు, రవిరెడ్డి, బీమానాయక్, రామాంజిని, ప్రతాపరెడ్డి, తిమ్మారెడ్డి పాల్గొన్నారు.

Back to Top