పంట నష్ట పరిహారంలో వివక్ష..కృష్ణా జిల్లా రైతుల ఆవేదన

కృష్ణా : పంట నష్ట పరిహారంలో అధికారులు వివక్ష చూపుతున్నారని కృష్ణా జిల్లా రైతులు వైయస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను బాపులపాడు, గన్నవరం మండలాల రైతులు కలిశారు. మినుము పంటకు తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టపోయామని రైతులు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. పరిహారం కోసం చేసిన సర్వేలో అధికారులు వివక్ష చూపుతున్నారని... కేవలం అధికార పార్టీ నేతల పొలాల్లోనే సర‍్వే చేస్తున్నారన్నారు. ఏలూరు కాల్వ కింద శివారు భూములకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు జగన్‌కు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కారించేందుకు కృషి చేస్తామని వైయస్‌ జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top