అగ్రిగోల్డు బాధితుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు బాబే కార‌కుడు


- అగ్రిగోల్డ్‌ ఇష్యూపై బీజేపీ స్పందించాలి
-   సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు
 విజయవాడ: అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కార విషయంలో టీడీపీ ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. అగ్రిగోల్డు బాధితుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు చంద్ర‌బాబే కార‌కుడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గురువారం  వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సంఖ్య దేశం మొత్తం మీదట 32 లక్షలకు పైగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ సంఖ్య 20 లక్షలకు పైగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కార విషయంలో ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నాలుగున్నరేళ్లుగా మాయ మాటలు చెప్పి 200 మందికి పైగా ఆత్మహత్యలకు సీఎం చంద్రబాబు నాయుడే కారణమని మండిపడ్డారు.   అగ్రిగోల్డ్‌ సంస్థకు అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నా కుట్రతో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం 1180 కోట్లు ఇస్తే 14 లక్షల కుటుంబాల సమస్య తీరుతుందని తెలిసినా స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై సీబీఐ విచారణకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ ఇష్యూపై బీజేపీ కూడా స్పందించాలని డిమాండ్‌ చేశారు. అందరినీ మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. ఫీజ్‌ రియింబర్స్‌మెంట్‌కి ఏపీ సీఎంకు అర్థం తెలుసా అని ఎద్దేవా చేశారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు మొత్తం చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతుంటే ఇప్పుడు కొత్తగా కమిటి వేస్తాననడం హాస్యాస్పదమన్నారు.


 

Back to Top