విజయవాడ: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్షాలను, ఉద్యోగులను, నష్టపోయిన రైతులను కలవాలంటే ఎందుకు ప్రభుత్వం భయపడుతుందని ఆయన ప్రశ్నించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఉద్యమిస్తే..వారిని ఎందుకు అరెస్టు చేశారని మండిపడ్డారు.