ప్రత్యేకహోదాకు అడ్డుపడుతుంది చంద్రబాబే

హైదరాబాద్ః రాష్ట్రమంతా ప్రత్యేకహోదా కోసం నినదిస్తుంటే...గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్లు హోదా వల్ల ఒరిగేదేమీ లేదన్న వాదనను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లడం శోచనీయమని వైయస్సార్సీపీ సీినియర్ నేత పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తే సరిపోదు, 15 ఏళ్లు కావాలని మాట్లాడిన బాబు...ఇప్పుడు హోదా అవసరమే లేదని మాట్లాడడం దుర్మార్గమన్నారు. అసలు ప్రత్యేకహోదాకు అడ్డుపడుతోంది చంద్రబాబేనన్న అనుమానం కలుగుతుందన్నారు. హోదాను నీరుగారుస్తూ చంద్రబాబు ఐదుకోట్ల ఆంధ్రులను మోసం చేస్తున్నారని...హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో  పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Back to Top