ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు

చంద్రబాబు నీచ రాజకీయాలు
లోకేష్ ప్రాపకం కోసం పాకులాట
ప్రలోభాలతో ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు
బాబు కుట్ర రాజకీయాలను ప్రజల్లో ఎండగడదాం
సేవ్ డెమోక్రసీని దిగ్విజయం చేద్దాంః పార్థసారథి

విజయవాడః  ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పుతూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్థసారథి  మండిపడ్డారు. అలా చేయడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని అన్నారు. ఇంత నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నాయకులను ఎక్కడ చూడలేదని ధ్వజమెత్తారు. లోకేష్ ప్రాపకం కోసం పాకులాడుతున్న మంత్రి యనమల రామకృష్ణ.. స్థాయిని మించి విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు. వైఎస్సార్సీపీపై విమర్శలు చేసినవారికే చంద్రబాబు ఉత్తమ ర్యాంకులు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. 

విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ...బిఆర్ అంబేద్కర్ కార్యక్రమం నేనే చేశాను, నేనే వారసుడ్ని అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఆర్థికాభివృద్ధి సాధించామంటూ అర్థం కానీ బాషలో సామాన్య ప్రజానీకాన్ని మభ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. అప్పు తీసుకునే అర్హత కోల్పోయారని కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే అప్పు కూడా తగ్గిస్తోందని, లోన్ లిమిట్స్ ఎందుకు తగ్గించిందో యనమల రామకృష్ణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 

నీ ఆర్థిక అభివృద్ధి రేటులో ప్రజలు వైద్యం పొందే అవకాశం కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చిన అధికారపార్టీ...ఆపథకాన్ని  అమలు చేయమని చేతులెత్తేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. కేవలం రూ.400 కోట్ల బకాయిలు చెల్లించలేక పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఆరోగ్యశ్రీని అమలు చేయలేమని చెప్పడం దుర్మార్గమన్నారు. 

బాబు నాయకత్వంలో రాష్ట్రం  ఏవిధంగా ఉందో ప్రజలకు అర్థమవుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడడమంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడమేనని ఉత్తరాఖాండ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని పార్థసారథి గుర్తు చేశారు. ఇతర పార్టీ శాసనసభ్యుల్ని ప్రలోభపెట్టి కోట్లాది రూపాయలు, మంత్రి పదవులు ఎరచూపుతూ చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.  కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్నిబాబు ఏవిధంగా  ఖూనీ చేస్తున్నారో... ఈనెల 25న ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాష్ట్రపతి, అన్ని రాజకీయ పక్షాలకు తెలియజేస్తామన్నారు

సంతలో పశువులను కొంటున్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాట్లాడిన చంద్రబాబు ఇవాళ ఏపీలో చేస్తున్నదేంటని ప్రశ్నించారు. సిగ్గుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని తెలంగాణలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఏమయ్యాయని కడిగిపారేశారు.  ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.  సేవ్ డెమోక్రసీ పేరున  సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వుత్తుల ప్రదర్శన చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఈకార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా ఖూనీ చేస్తున్నారో రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పాలన్నారు. 

Back to Top