ఘనంగా పార్థ‌సార‌ధి జన్మదిన వేడుకలు

కంకిపాడు :వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి జన్మదిన వేడుకలు నాయ‌కులు, కార్య‌క్తర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఉప్పులూరు, మంతెన గ్రామాల్లో నాయకులు కేక్‌కట్ చేసి పార్థ‌సారధికి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఆయన గెస్ట్‌హౌస్‌కి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ నెరుసు సతీష్, మంతెన పీఏసీఎస్ అధ్యక్షుడు పటాకుల శ్రీనివాసరావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాజులపాటి శివబ్రహ్మేశ్వరరావు, మాగంటి వెంకటేష్, నెరుసు శివ తదితరులు పాల్గొన్నారు.
Back to Top