ఇసుక మాఫియాకు చంద్రబాబు ప్రోత్సాహం

 హైదరాబాద్: అవినీతిని అడ్డుకున్న తహశీల్దార్‌పై జరిగిన
దాడిని సీఎం సమర్థించడాన్ని మాజీమంత్రి పార్థ సారధి తప్పు పట్టారు.   ఈ ఘటనతో ఇసుక మాఫియాను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారనేది
స్పష్టమయిందన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.    చంద్రబాబు తీరు ప్రజాస్వామానికే సిగ్గు చేటుగా
ఉందని ఆరోపించారు.     వనజాక్షి పెట్టిన కేసును
నీరుగార్చేందుకు సాక్షాత్తూ చంద్రబాబే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళా
అధికారి వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చి పారేసినా పట్టించుకోకపోవడం
దారుణమని వ్యాఖ్యానించారు. ఇలా సెటిల్‌మెంట్లు చేస్తే అధికారులు ఎలా ధైర్యంగా పని చేయగలుగుతారని
చంద్రబాబును పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. 
వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై దౌర్జన్యంగా కేసులు బనాయించి
జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని
పార్థసారథి విమర్శించారు.

Back to Top