ప్రజాస్వామ్యం ఖూనీ

చంద్రబాబు సెక్స్ రాకెట్ కుట్ర
తమ్ముళ్లను తప్పించేందుకు చర్చకు ఆటంకం
ప్రతిపక్షంపై నిందలు వేస్తూ పాలకుల దుర్బుద్ది
టీడీపీ సర్కార్ పై పార్దసారథి ఆగ్రహం

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్ధసారథి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు
చెరిగారు. సమస్యల మీద పూర్తిస్థాయిలో చర్చ జరగకుండా అడ్డుకట్ట వేస్తూ
టీడీపీ సమావేశాలను ముగించాలని చూస్తోందని ఫైరయ్యారు. కాల్ మనీ సెక్స్
రాకెట్ నుంచి తమ వాళ్లను తప్పించేందుకే టీడీపీ సర్కార్ వైఎస్సార్సీపీపై
బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్
అంశాన్ని  రాజధాని పరువను దిగజార్చే చర్యగా పరిగణించకుండా ..ఎంతసేపు
దోషుల్ని తప్పించడానికే ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమరావతి గౌరవాన్ని
కించపర్చేవిధంగా చంద్రబాబు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆనెపాన్ని ఇతర
పార్టీలపై వేయడం సరికాదన్నారు.  

కాల్ మనీ సెక్స్
రాకెట్ లో టీడీపీ ప్రజాప్రతినిధుల పాత్రపై వైఎస్సార్సీపీ చర్చకు
పట్టుబడితే...అక్కడ ఏం జరగలేదంటూ తెలుగుదేశం నేతలు బుకాయించడం
దారుణమన్నారు. మీడియా, వైఎస్సార్సీపీ కావాలనే సృష్టిస్తోందన్నట్లు
మాట్లాడడం సిగ్గుచేటన్నారు. స్వయంగా అధికారులే టీడీపీ నేతల కాల్ మనీ సెక్స్
రాకెట్ బాగోతాన్ని గుట్టురట్టుచేశారని...సీపీ గౌతం నవాంగ్ సైతం నిందితులపై
చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. అధికారులు గుర్తించారు, పత్రికల్లో
సెక్స్ రాకెట్ గురించి స్పష్టంగా వచ్చింది. ఇంకా చంద్రబాబుకు ఏం సాక్షాలు
కావాలని ప్రశ్నించారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్
పై చర్చను పక్కదారి పట్టించడం కోసం పచ్చసర్కార్  అంబేద్కర్ గారి పేరు
తెరపైకి తీసుకొచ్చిందన్నారు.  శంకుస్థాపన కార్యక్రమం రోజు స్థానిక దళిత
ఎమ్మెల్యేని ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీదకు పిలవని చంద్రంబాబు... దళితుల
మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని మండిపడ్డారు.  దళితుల కాలనీలో 1500
స్కూళ్లు మూసివేయించారు. మీకా దళితుల మీద ప్రేమ ఉంది అని చంద్రబాబుపై
పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని  భూములను మంత్రులు,
ఎమ్మెల్యేలు తక్కువ ధరకు కొని  రెగ్యులరైజ్ చేసుకొని ల్యాండ్ పూలింగ్ లో
ఇచ్చిన పరిహారం లాగా పొందడానికి కుట్ర చేస్తున్నారని పార్ధసారథి
విరుచుకుపడ్డారు. రాజధానిని విదేశీ కంపెనీలకు అమ్మేస్తున్నారని వాపోయారు. 

మహిళా
ఎమ్మెల్యే రోజాను ఎంలాటి ఆధారాలు చూపించకుండా సంవత్సరం పాటు సస్పెండ్
చేసిన చంద్రబాబు...కాల్ మనీ సెక్స్ ముఠాలు మహిళల్ని శారీరకంగా
జుగుప్సాకరంగా  హింసిస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారని  ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో సంవత్సరాల కొద్ది సస్పెండ్ చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా
అని కడిగిపారేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన
చేస్తోందని దుయ్యబట్టారు.  చంద్రబాబు మీ మంత్రులు, శాసనసభ్యులు ఎన్నోసార్లు
అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేశారు. మరి వారిని ఎందుకు సస్పెండ్ చేయడం
లేదని ఎత్తిపొడిచారు. మాకు అధికారం ఉంది. శాసనసభకు సర్వ హక్కులున్నాయంటూ
ప్రతిపక్షాన్ని , సభ్యులను సస్పెండ్ చేస్తామనడం దుర్మార్గమన్నారు.
చంద్రబాబు మీ తప్పులు బయటపడ తాయనుకుంటే సస్పెండ్ చేస్తారా..ఇదేనా
ప్రజాస్వామ్యం స్పూర్తి అని  నిలదీశారు. 

కేసును
చేధించలేక చేతగాని తనంతో ఇతర పార్టీలపై బురజల్లవద్దని ప్రభుత్వానికి
పార్ధసారథి హితవు పలికారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఉన్నవాళ్లంతా
ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయవాడ న్యాక్ కళ్యాణమండపంలో మంత్రులు,
శాసనసభ్యులకు సన్మానం చేయలేదా అని ప్రశ్నించారు.  రాజధాని అమరావతి గౌరవం
ఇనుమడింపజేసేవిధంగా కాల్ మనీ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
చేశారు. జేసీ దివాకర్ రెడ్డి, విష్ణుకుమార్ రాజులు మా ప్రాంతంలో కాలమనీ
చాలా జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు. అది ఎంత అన్యాయమో ఆలోచించాలన్నారు. 
Back to Top