దమ్మూ, ధైర్యం ఉంటే చర్చకు రా

హైదరాబాద్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్థసారధి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి అమరావతికి పంపించేశారంటున్న చంద్రబాబు...తమ ఆడంబారాల కోసం వందలాది కోట్ల రూపాయలు ఎందుకు దుబారా చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖజానా ఖాళీ అయిందంటూనే హంగులు ఆర్భాటాల కోసం  అడ్డగోలుగా ప్రభుత్వ నిధులు హెచ్చిస్తున్నారని మండిపడ్డారు. మాయమాటలు, అబద్ధాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని పార్థసారధి విమర్శించారు. 

దమ్మూ, ధైర్యం ఉంటే ఆదాయ వ్యయాలపై ఆర్థికమంత్రి బహిరంగ చర్చకు రావాలని పార్థసారధి సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవ ఆర్థిక పరిస్థితులు వివరించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలకు వందలకోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని పార్థసారది నిప్పులు చెరిగారు.  సంక్షేమ కార్యక్రమాల్లోనూ విచ్చలవిడిగా  కోతలు విధిస్తున్నారని, ప్రజలపై ఛార్జీలు, పన్నుల బారం మోపుతున్నారని  ధ్వజమెత్తారు.
Back to Top