త‌గిన మూల్యం త‌ప్ప‌దు


హైద‌రాబాద్) రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని మాజీ మంత్రి పార్థ సార‌ధి హెచ్చరించారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్ర‌త్యేక హోద కోసం త‌మ పార్టీ త‌ర‌పున అనేక సార్లు ఢిల్లీలోని పెద్ద‌ల్ని క‌లిసి విన‌తి పత్రాలు అంద‌చేశామ‌ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త కేంద్రం మీద‌నే ఉంది. కేంద్రం ద‌గ్గ‌ర చంద్ర‌బాబు మోక‌రిల్లుతున్నారు. అర్హ‌త‌ల ఆధారంగా ఇచ్చేది కాద‌ని పార్థ సార‌ధి గుర్తు చేశారు.

Back to Top