వైయస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యం


కృష్ణా జిల్లా: రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి వైయస్‌ జగన్‌పై విశ్వాసం ఉందని, ఆయన సీఎం కావడం తథ్యమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఉయ్యూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ రాకతో పెనమలూరి నియోజకవర్గంలో ఉత్సాహం ఉప్పొంగిపోయిందన్నారు. ఈ ప్రభుత్వం పేదవారికి ఒక రేషన్‌కార్డు ఇవ్వాలంటే టీడీపీ నేతలు వారి బాబు సొమ్ము మాదిరిగా విలవిలబోతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంవచ్చిన తరువాత ఏ వర్గానికి మేలు జరగలేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లు వేసిన వారికి గొంతు కోశారని విమర్శించారు. రుణమాఫీ చేయలేదని, ఇంటికో ఉద్యోగం అన్నాడు..నిరుద్యోగులను దగా చేశారన్నారు. పేదలకు  ఒక సెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ రాగానే పేదవారందరికి ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చారు. టీడీపీ అరాచకాలపై ఒక్కసారి ఆలోచన చేయాలని సూచించారు. రైతులు పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కౌలు రైతులను మోసం చేశారని విమర్శించారు. మళ్లీ రామరాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ రావాలన్నారు. వైయస్‌ జగన్‌ జపంతో ఈ ప్రభుత్వం బతుకుతుందన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు, లజ్జ లేదని విమర్శించారు. ఉదయం నుంచి తాను వైయస్‌ జగన్‌తో పాదయాత్ర చేస్తున్నానని, ఉదయం ఏ చిరునవ్వుతో బయటకు వస్తారని, సాయంత్రం కూడా అదే చిరునవ్వుతో బస ప్రాంతంలోకి వెళ్తారని చెప్పారు. చంద్రబాబు వద్దకు మత్స్యసోదరులు వెళ్లి అయ్యా మమ్మల్ని ఎస్సీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారని అడిగితే..నన్ను ప్రశ్నిస్తారా అని మత్స్యకారులను హెచ్చరించిన చంద్రబాబు కాదా అన్నారు. బలహీన వర్గాల ప్రజలు మధ్యాహ్నం కొందరు వైయస్‌ జగన్‌ను కలిశారన్నారు. బలహీన వర్గాలకు చెందిన న్యాయవాదులను జడ్జిలు కాకుండా చంద్రబాబు గండి కొట్టారన్నారు. చంద్రబాబు తన బాబు సొమ్ము ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీ వర్గాలకు చెందిన న్యాయవాదులు జడ్జిలు కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు పేదలు, బలహీన వర్గాలు, దళితులు అంటే చిన్నచూపు అన్నారు. ముస్లింలకు మంత్రివర్గంలో చోటు లేదన్నారు. చంద్రబాబుకు అహంకారం ఉంది కాబట్టి ముస్లింలకు, గిరిజనులకు మంత్రి పదవులు ఇవ్వకుండా దగా చేశారన్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అ ని చంద్రబాబు అవమానించారన్నారు. ఈ రాష్ట్రం నీ బాబు గారి సొత్తు కాదని హెచ్చరించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉయ్యూరు లో డ్రైనేజీ కోసం రూ. 4 కోట్లు ఇచ్చారన్నారు. జగనన్నా..టీడీపీ ప్రభుత్వం ఉయ్యూరు వాసులకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించాలని కోరారు. కాల్వ కట్ల మీద అనాతికాలంగా ఉంటున్న వారికి కూడా ఇల్లు నిర్మించాలని కోరారు. 
 

తాజా ఫోటోలు

Back to Top