చంద్రబాబుకు పార్థసారధి ఓపెన్‌ ఛాలెంజ్‌

బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ పొత్తుపెట్టుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
అందుకు మీరు.. మీ మంత్రివర్గ సభ్యులు సిద్ధమా..?
ఒంటరిపోరుకే సై అన్న మా నాయకుడి మాటపై నాకు విశ్వాసం ఉంది
చంద్రబాబుకు ఒక ఛాలెంజ్‌ విసురుతున్నా.. పరిపాలన గురించి మాట్లాడడం లేదు కానీ పదే పదే వైయస్‌ జగన్‌ బీజేపీతో కుమ్మకయ్యారు.. కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారని వైయస్‌ జగన్‌ను విమర్శించడమే సింగిల్‌ ఎజెండాగా పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడన్నారు. బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే నేను నా కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతాం. టీడీపీ ప్రభుత్వ మంత్రివర్గంలో ఏ వ్యక్తికైనా చంద్రబాబు మాటలపై నమ్మకం ఉంటే.. మీరు తప్పుకుంటారా..? అని ఛాలెంజ్‌ విసిరారు. ఆఖరికి మంత్రులకే చంద్రబాబు అబద్ధపు ప్రచారాలపై నమ్మకం లేదు. కేవలం తన వైఫల్యాలను, అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి బాబు కాలం వెల్లదీస్తున్నాడని, తప్పుడు ప్రచారాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. బీజేపీ పొత్తు ఉండదని మా నాయకుడు వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారన్నారు.
Back to Top