చంద్ర‌బాబూ.. ఇది సిగ్గుచేటు..!


హైద‌రాబాద్‌) రాష్ట్రాన్ని గాలికి వ‌దిలేసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విదేశాల‌కు షికారు చేయ‌టం సిగ్గుచేటు అని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నేత పార్థ సార‌ధి అన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర‌కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు వాన‌లు లేక పొలాలు ఎండిపోతున్నాయని పార్థ సార‌ధి చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాల మీద చైత‌న్య ప‌ర‌చాల్సిన బాధ్య‌త వ్య‌వ‌సాయ శాఖ మీద ఉంద‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో అటువంటి దాఖ‌లాలు క‌నిపించ‌టం లేద‌న్నారు. పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప‌రిహారం అందించాల‌ని పార్థ సార‌ధి కోరారు.

Back to Top