ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన పేర్నినాని

మచిలీపట్నం టౌన్‌ :పట్టణంలో పవిత్ర రంజాన్‌ వేడుకలను జరుపుకుంటున్న ముస్లింలకు మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.    మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, 29వ వార్డు కౌన్సిలర్‌ మీర్‌ అస్గర్‌అలీ నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు లంకా సూరిబాబు, మేకల సుబ్బన్న, మట్టా తులసి, కేడీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ సమ్మెట సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top